ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

byసూర్య | Thu, Dec 08, 2022, 12:32 PM

ఆర్థిక కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగెం గ్రామానికి చెందిన పూస్కూరి యాదయ్య -కలమ్మ దంపతుల చిన్న కుమార్తె ప్రశాంతి ని పొద్దుటూరు గ్రామానికి చెందిన కుమార్ కు 7 ఏండ్లు కిందట వివాహం జరిగింది. కొంతకాలం నుండి ఆర్థిక సమస్యలతో ప్రశాంతి మనస్థాపం చెందగా, ఇటీవల సోదరుడు పుట్టింటికి తీసుకొచ్చాడు. ప్రశాంతి బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

దమ్మున్న నాయకుడంటూ బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రశంస Sun, Feb 05, 2023, 06:11 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యం: జగ్గారెడ్డి Sun, Feb 05, 2023, 06:10 PM
సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు Sun, Feb 05, 2023, 06:08 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి Sun, Feb 05, 2023, 06:07 PM
డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ Sun, Feb 05, 2023, 05:41 PM