పోలీస్ అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ ప్రారంభం

byసూర్య | Thu, Dec 08, 2022, 10:48 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గురువారం ఫిజికల్‌ ఈవెంట్స్‌ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లోని కేంద్రాల్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఫిజికల్‌ ఈవెంట్స్‌ కు సంబంధించిన ప్రతి దశనూ సీసీ కెమెరాలతో నమోదు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఫిజికల్‌ ఈవెంట్స్‌ ప్రక్రియ పూర్తికానుంది.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM