రెవెన్యూ సదస్సుల ద్వారా సత్వరమే భూ సమస్యల పరిష్కారం

byసూర్య | Tue, Dec 06, 2022, 04:53 PM

ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రమైన గుమ్మడిదల లోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ వివాదహిత గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామాల్లో వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారుల సమక్షంలో సమస్యలను పరిష్కరించి, అక్కడే ఏర్పాటు చేసిన మీ సేవ సెంటర్ ద్వారా రికార్డుల్లోనూ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, తహసిల్దార్ సుజాత, గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దమ్మున్న నాయకుడంటూ బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రశంస Sun, Feb 05, 2023, 06:11 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యం: జగ్గారెడ్డి Sun, Feb 05, 2023, 06:10 PM
సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు Sun, Feb 05, 2023, 06:08 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి Sun, Feb 05, 2023, 06:07 PM
డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ Sun, Feb 05, 2023, 05:41 PM