జీ ఓ 317 కు వ్యతిరేకంగా నిరసన

byసూర్య | Tue, Dec 06, 2022, 04:50 PM

జిఓ 317 విడుదలై నేటికీ సంవత్సరం అయిన సందర్భంగా జీ ఓ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో భోజన విరామ సమయంలో జీవో 317 వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ జిఓ వలన అనేక మంది ఉపధ్యాయులు తమ స్థానికతను కోల్పోయారని, అనేకమంది భార్య భర్తలు వేర్వేరు జిల్లాల్లో ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చిందని, వెంటనే ప్రభుత్వం ఈ జీవో వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో తపస్ చేగుంట మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు రమేశ్, రాధ, సుధాకర్ రెడ్డి, రాథోడ్, చక్రధర్ శర్మ, ఈశ్వరయ్య, రాజేశ్వర్ రావు, భవాని, శారదా, మాదవి, సునంద, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM