ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి కృషి

byసూర్య | Tue, Dec 06, 2022, 04:21 PM

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో గిరిజన డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేయడం జరిగింద‌ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, దేవేందర్, స్థానిక కౌన్సిలర్ తస్కీనసుల్తానా, సీపీడీసీ కార్యదర్శి శంసాన్, కళాశాల ప్రిన్సిపల్ రామరాజు, పగిడిమర్రి రఘురాములు, గాజుల రాజేష్, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ Mon, Jan 30, 2023, 05:11 PM
బిజేపి కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు Mon, Jan 30, 2023, 05:05 PM
హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ పై అవగాహన సదస్సు.. Mon, Jan 30, 2023, 05:02 PM
బాల్య వివాహాల పై అవగాహన సదస్సు.. Mon, Jan 30, 2023, 05:01 PM
ప్రతి ఉపాధి కూలీది ఆధార్ సీడింగ్ చేయాలి.. Mon, Jan 30, 2023, 04:59 PM