బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ

byసూర్య | Sun, Dec 04, 2022, 09:33 PM

పోలీసులు ఎన్నిచర్యలు తీసుకొన్నా హైదరాబాద్ నగరంలో ఏదో ఒక మూల గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు జరుగుతునే ఉన్నాయి. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఈ పార్టీలో 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. వీళ్లంతా గంజాయి మత్తులో ఉన్నట్టు గమనించిన పోలీసులు.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో.. నగరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులు ఉన్నట్టు సమాచారం. పసుమాముల ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో శనివారం రాత్రి సమయంలో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. వెంటనే దాడి చేశారు.


జతిన్‌ సుభాష్‌ అనే విద్యార్థి బర్త్‌డే సందర్భంగా స్నేహితులకు ఈ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని.. 11 కార్లు, 1 బైక్‌, 28 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు గంజాయి సప్లై చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నగరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా పార్టీ నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM