కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా

byసూర్య | Fri, Dec 02, 2022, 11:49 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితాపై ఆరోపణలతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. 160 సీఆర్పీసీ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెండ్ ఆఫ్ పోలీస్ సీబీఐ అలోక్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు. అయితే.. కేసు విచారణలో భాగంగా కాకుండా కేవలం.. వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 6 వ తేదీన.. తనకు వీలైన సమయంలో హైదరాబాదా లేదా వీలేతే ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చి కేసు గురించి వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై పలు విషయాలు తెలియాల్సి ఉన్నాయని.. అందుకే కవిత వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. డిసెంబర్ 6న తన ఇంటి వద్దే వివరణ ఇస్తానని తెలిపినట్టు సమాచారం. మొదటి విపక్షాలు కవితపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. కవితకు నోటీసులు అందటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకు వచ్చిన రోజు నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరు అధికారికంగా బయటకు వచ్చింది. ఈడీ అధికారులు చేర్చిన పేర్లలో కల్వకుంట్ల కవిత అనే పేరు ఉంది. 32 పేజీల రిపోర్టులో మూడు చోట్ల కవిత పేరును అధికారులు ప్రస్తావించారు.


ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు తరలించినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘సౌత్ గ్రూప్‌’ను శరత్ రెడ్డి, కె కవిత, మాగుంట నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.


ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో కార్యకలాపాల నిమిత్తం ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లను కవిత ధ్వంసం చేసినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసులో మొత్తం 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.



Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM