పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం

byసూర్య | Fri, Dec 02, 2022, 08:42 PM

గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని ప్రశంసించారు. గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందని చెప్పారు. దీంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని... కౌన్సిలర్లతో వార్డు అధికారులకు మంచి సమన్వయం నెలకొంటుందని తెలిపారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.



Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM