పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మామూలే

byసూర్య | Fri, Dec 02, 2022, 12:17 AM

పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని ఈడీ విచారణపై హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ ను అధికారులు విచారించారు. కాగా, విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు హీరో విజయ్ విలేకరులతో మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ.. 


విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీసుకు వచ్చినట్లు విజయ్ తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబిచ్చినట్లు చెప్పారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. పాప్యులారిటీ పెరుగుతున్నపుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని విజయ్ దేవరకొండ చెప్పారు. 


ఇదిలావుంటే విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ సినిమాను రూ.100 కోట్లతో తెరకెక్కించినట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. ఈ పెట్టుబడులలో మనీలాండరింగ్, హవాలా కోణాలపై ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. లైగర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు.



Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM