సంస్కర హీనంగా మాట్లాడుతున్న షర్మిల: బల్క సుమన్

byసూర్య | Fri, Dec 02, 2022, 12:17 AM

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆమె సంస్కారహీనంగా మాట్లాడుతూ, అడుగడుగునా తెలంగాణను అవమానిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ వనరులను దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని... గతంలో మానుకోటలో జగన్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను మర్చిపోవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆనాడు పార్లమెంటులో జగన్ ప్లకార్డులను ప్రదర్శించారని చెప్పారు. 


'మీరు తిరిగి వచ్చుంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు రాజన్నా' అంటూ షర్మిల గతంలో తన తండ్రి వైఎస్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారని గుర్తు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ బయ్యారం గనులను కొల్లగొట్టాలని చూశారని దుయ్యబట్టారు. కిరాయి మనుషులైన షర్మిల వంటి వ్యక్తుల తోలుబొమ్మలాటను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. షర్మిల భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.Latest News
 

పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని.... సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం Mon, Jan 30, 2023, 05:45 PM
తగ్గిన తెలంగాణ సర్కారు,,,గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు Mon, Jan 30, 2023, 05:44 PM
ఆ ఇద్దరూ తెలంగాణను దోచుకొంటున్నారు: ధర్మపురి అర్వింద్ Mon, Jan 30, 2023, 05:43 PM
బీజేపీలో కోవర్టు వ్యాఖ్యల కలకలం... ఈ విషయంలో ఈటల, బండి చెరో మాట Mon, Jan 30, 2023, 05:43 PM
దొరికింది వారు కాదటా...ఇంకోకరు అటా....విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు Mon, Jan 30, 2023, 05:42 PM