భోదన ఆసుపత్రులకు పోస్టులను మంజూరు చేసిన సర్కార్

byసూర్య | Thu, Dec 01, 2022, 10:34 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 9 జిల్లా కేంద్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న బోధనాసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు పోస్టులను కేటాయిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోధనాసుపత్రికి 433 పోస్టుల చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల్లో ఆయా బోధనాసుపత్రులతో పాటు వాటికి అనుబంధంగా ఏర్పాటు కానున్న ఆసుపత్రులకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 


రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం అసిఫాబాద్, జనగాం, నిర్మల్ లలో వచ్చే ఏడాది బోధనాసుపత్రులను ప్రారంభించనున్నారు. వీటికి అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరత్రా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం ఓ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణను మరింత పరిపుష్టం చేసేలా కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నామని సదరు ట్వీట్ లో హరీశ్ రావు పేర్కొన్నారు.



Latest News
 

మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM
కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు Sat, Apr 20, 2024, 09:02 PM
హైదరాబాద్‌లో 160 కిలోల నల్లమందు సీజ్.. గసగసాల పంట ద్వారా మత్తు మందు తయారీ Sat, Apr 20, 2024, 08:58 PM
బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM