ఫిర్యాదు చేస్తే ఇంటి మీటర్ డిస్కనెక్ట్ చేశారు

byసూర్య | Thu, Dec 01, 2022, 02:02 PM

వ్యవసాయ బావుల వద్ద హై టెన్షన్ వైర్ల సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏకంగా తమ ఇంటి మీటర్ డిస్కనెక్ట్ చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూరు మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన నందిగామ బాబు తన వ్యవసాయ పొలంలో నుండి 11 కెవి విద్యుత్ వైర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి హార్వెస్టర్ మిషన్ కు అనే విధంగా ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియకపోవడంతో బాధితుడు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వైర్లను సరిచేయాలని గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఏ మాత్రము పట్టించుకోవడం లేదు.


ఇటీవల ఆయన తన వ్యవసాయ భూమిలో సాగు చేసినా వరి పంటను కోసేందుకు హార్వెస్టర్ మిషన్ తీసుకువచ్చారు. విద్యుత్ వైర్ల వల్ల వారి పంట కోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇట్టి విషయంలో బాధితుడు బాబు మరోసారి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇట్టి విషయాన్ని స్థానిక సిబ్బందికి అధికారులు సమాచారం అందించారు. బుధవారం తన ఇంటి కరెంట్ బిల్లు సకాలంలో చెల్లించలేదన్న సాకుతో విద్యుత్ సిబ్బంది ఇంటికి వెళ్లి మీటర్ డిస్కనెక్షన్ చేశారు. దీంతో విద్యుత్ సిబ్బందితో బాధితుడు వాగ్వివాదానికి దిగాడు. తమపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ మరో మారు సిబ్బంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


సకాలంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లించలేనందున కనెక్షన్ తొలగిస్తున్నామని సిబ్బంది తెలియచేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు విద్యుత్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తన తండ్రి కరెంట్ షాక్ వల్ల వ్యవసాయ బావి వద్ద ఇటీవల మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటలోపు బిల్లు చెల్లిస్తామని చెప్పినా వినకపోవడం పట్ల వారి తీరుపై ఆగ్రహం చెందారు. విద్యుత్ అధికారుల సిబ్బంది వ్యవహారంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM