ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు: ఈటల రాజేందర్

byసూర్య | Wed, Nov 30, 2022, 10:48 PM

సీఎం కేసీఆర్  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అనాలోచిత నిర్ణయాలతో అప్పుల పాలు చేశారన్నారు. 25 ఏళ్ల కాలపరిమితితో ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన రుణ భారం మోపుతున్నారని ఆక్షేపించారు. అప్పటి వరకూ తాను ఉండను అనుకొని కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారన్నారు.


రాష్ట్రం తీసుకున్న అప్పుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉన్నా... కేసీఆర్ పెట్టనివ్వరన్నారు. అప్పల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు చర్చకు రావాలని ఈటల సవాల్ విసిరారు. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాన్ని త్వరలోనే బహిర్గతమవుతంది.., వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహిరిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజాస్వామ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యనించారు. వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పోలీసులు వ్యవహిరించిన తీరు సరిగా లేదని అన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇలాగే వ్యవహరించి ఉంటే.. తెలంగాణ ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల అరాచకంగా వ్యవహరిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల్లో పోలీసులు కీలు బొమ్మలుగా మారి ఆయన చెప్పిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ అరాచకాలకు త్వరలోనే ఎండ్ కార్డు పడనుందని.., ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఈటల హెచ్చరించారు.



Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM