తుషార్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

byసూర్య | Wed, Nov 30, 2022, 10:47 PM

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశం జారీచేసింది. ఈ కేసులో కేరళకు చెందిన తుషార్‌ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అనుమానితుడిగా ఉన్న తుషార్‌కు తెలంగాణ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న విచారమకు హాజరు కావాలని తుషార్‌తో పాటు బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులపై తుషార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో తుషార్ పేర్కొన్నారు. కాగా.. ఈ నెల 21న విచారణకు రావాలని తనకు 16వ తేదీన 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని తెలిపారు. అయితే తనకు అనారోగ్యంగా ఉండటం వల్ల.. వైద్యుల సూచనల మేరకు అధికారులను రెండు వారాల గడువు కోరినట్టు తెలిపారు. కానీ.. తన మెయిల్‌కు కనీసం ఎలాంటి రిప్లై ఇవ్వకుండానే.. తనపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని తుషార్ ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం..తుషార్‌ను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదే సంయంలో సిట్ విచారమకు సహకరించాలని తుషార్‌ను కూడా హైకోర్టు ఆదేశించింది.


మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23న బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు కూడా విచారణకు రావాలని నోటీసులు పంపినా.. ఆయన విచారణకు రాలేదు. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25న బీఎల్ సంతోష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబర్ 5 వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.



Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM