ఐ.టీ.ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు...టీఎస్ ఆర్టీసీ నిర్ణయం

byసూర్య | Wed, Nov 30, 2022, 10:45 PM

ఐటీ ఉద్యోగుల కోసం నగరంలో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం టీఎస్ ఆర్టీసీ తీసుకుంది. దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తాజాగా ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ సూచించింది. ఐటీ ఉద్యోగులకు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.


హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్‌ ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా నడుస్తోన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగులు.. తమ ఆఫీసులకు వెంటనే చేరుకునేందుకు వీలుగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. బస్సు సౌకర్యం కావాలనుకునే ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్‌లో దరఖాస్తుకి సంబంధించిన లింక్‌ను పోస్ట్ చేశారు. ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. ఐటీ ఉద్యోగుల తమ కంపెనీ పేరు, పికప్, డ్రాప్ లొకేషన్‌తో పాటు ఏ సమయంలో బస్సు సౌకర్యం కావాలనే వివరాలను దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది. మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ఉదయం ఇంటి దగ్గర ఏ సమయానికి పికప్ చేసుకోవాలి? సాయంత్రం ఆఫీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఏ సమాయానికి పికప్ చేసుకోవాలి? అనే వివరాలను కూడా తెలపాల్సి ఉంటుంది.


దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 5ను చివరితేదీగా నిర్ణయించారు. ఆర్టీసీ సేవలకు సంబంధించి ఏమైనా సలహాలను కూడా తమ దరఖాస్తుల్లో తెలపాలని టీఎస్ఆర్టీసీ కోరింది. టీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని ఐటీ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ఇది చాలా అవసరమైనదని, మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ఐటీ ఉద్యోగులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు బస్సులు మారాల్సి వస్తుందని, తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఊరట కలుగుతుందని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ట్రాఫిక్‌ వల్ల తాము ఆఫీసులకు సమయానికి చేరుకోవడం కష్టంగా మారిందని, దానిపై కూడా చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.


అటు త్వరలో హైదరాబాద్‌ సిటీలో కొత్తగా 1020 బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ కొత్త బస్సు అందుబాటులోకి రానున్నాయి. 700 సూపర్ లగ్జరీ బస్సులతో పాటు 320 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుంది.



Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM