ధర్మపురి అరవింద్ పిటిషన్‌పై ముగిసిన విచారణ

byసూర్య | Tue, Nov 29, 2022, 03:34 PM

ధర్మపురి అరవింద్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ పూర్తైంది. ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరుపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తరచూ జరిగేదేనని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పని చేయాలని సూచించింది. బయట జరిగే రాజకీయ పరిణామాలను తాము మీడియా, పత్రికల్లో చూస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్సీపై కేసు నమోదు చేయాలని పిటిషన్ కౌన్సిల్ రచనా రెడ్డి కోరారు. కరీంనగర్ సర్కిల్‌లో అరవింద్ ని అటాక్ చేస్తామని బెదిరించారని రచన తెలిపారు.

ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చర్యలు తీస్కున్నారని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. మీడియా సాక్షిగా అర్వింద్ పై బెదిరింపులకు దిగారని రచన కోర్టుకు తెలిపారు. ధర్మపురి అరవింద్ అసభ్యకర స్టేట్మెంట్‌లు చేశారని ఏజీ పేర్కొన్నారు. పొలిటీషియన్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం సహజమేనని హైకోర్టు పేర్కొంది. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. ఇంకా నిందితులు ఎవరైనా ఉంటే వారిని సైతం చేర్చాలని తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో విచారణ ముగిసింది.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM