మందుబాబులకు అడ్డగా మారిన వేములవాడ మినీ స్టేడియం

byసూర్య | Tue, Nov 29, 2022, 02:31 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నత్తనడకలు కొనసాగుతున్న మినీ స్టేడియంను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. 2014లో అప్పటి స్పీకర్ మధుసూదనా చారి చేతులమీదుగా శంకుస్థాపన చేసిన మినీ స్టేడియం 8 సంవత్సరాలు కావస్తున్న నిర్మాణం పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక క్రీడాకారులకు క్రీడా ప్రాంగణం లేకపోవడంతో క్రీడలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి నియోజకవర్గం లో ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే క్రీడా ప్రాంగణ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగ వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM