అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూములు ఇవ్వాలి

byసూర్య | Thu, Nov 24, 2022, 04:01 PM

సిపిఐ ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలో అర్హులైన వారు అందరికీ రేషన్ కార్డులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలి అని గురువారం ఆందోళన చేసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, మాట్లాడుతూ టిఆర్ఎస్ అధికారం చేపట్టి 8 సంవత్సరాల కావస్తున్న అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు డబల్ బెడ్ రూమ్ ఇల్లు దళితులకు మూడు ఎకరాల భూమి ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూములు మంజూరు చేయలేదు అని అన్నారు. ఎంతో మంది నిరుపేదలు తెల్ల రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రాఘవరావు, రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సభ్యులు బండారుపల్లి ముత్తయ్య , ఏఐటీయూసీ మండల కార్యదర్శి గారపాటి అశోక్, మూటకొండ, ఆళ్ల రాంబాబు గంజనుబోయిన తిరుమలయ్య, బట్టు లక్ష్మయ్య, కొండ రామకృష్ణ, బండారుపల్లి రవి పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా Fri, Dec 02, 2022, 11:49 PM
టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ సమన్లు జారీ Fri, Dec 02, 2022, 11:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Dec 02, 2022, 10:33 PM
తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి Fri, Dec 02, 2022, 09:05 PM
పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం Fri, Dec 02, 2022, 08:42 PM