ఐటీ దాడులు బీజేపీ రాజకీయ పార్టీ కుట్ర: మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Thu, Nov 24, 2022, 03:08 PM

భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు చేయిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మమ్మల్నే కాదు. మా కేసీఆర్ను కూడా ఏమీ చేయలేరని మంత్రి స్పష్టంచేశారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. నా పేరు ప్రతిష్టలు డామేజ్ చేసేందుకు ఐటీ దాడులు చేయించారని మండి పడ్డారు. నేను పాలు, పూలు అమ్మిన, బోరు బావులు వేసినా. చిట్ ఫండ్లు నడిపినా. విద్యా సంస్థలను నెలకొల్పినా. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నానని వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో సీట్లన్నీ ఆన్లైన్ లో పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా డోనేషన్లే లేనప్పుడు రూ. 100 కోట్లు ఎక్కడ వసూలు చేస్తామని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఐటీ రెయిడ్ లుండవు. బీజేపీలో లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నారని మండి పడ్డారు.

Latest News
 

కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా Fri, Dec 02, 2022, 11:49 PM
టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ సమన్లు జారీ Fri, Dec 02, 2022, 11:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Dec 02, 2022, 10:33 PM
తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి Fri, Dec 02, 2022, 09:05 PM
పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం Fri, Dec 02, 2022, 08:42 PM