రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

byసూర్య | Thu, Nov 24, 2022, 11:52 AM

పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జార్ఖండ్ లోని జామ్డకు చెందిన ఆకాశ్ భండారీ తండ్రి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి తల్లి అసీమాతో కలిసి హయతనగర్ లెక్చరర్స్ కాలనీలో ఉంటున్నాడు. సంఘీ సమీపంలోని లిమినార్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. డిసెంబరు 4న వివాహం జరగాల్సి ఉంది. నాలుగు రోజుల్లో స్వగ్రామం వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన ఆకాశ్ రాత్రి 9. 30కు బైక్ పై ఓఆర్ఆర్ మీదుగా ఇంటికి బయలుదేరాడు. కొహెడ, పెద్దఅంబర్ పేట్ ఓఆర్ఆర్ దగ్గర ఆకాష్ స్కూటీ ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు  తెలిపారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM