ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి: వంశీకృష్ణ

byసూర్య | Thu, Nov 24, 2022, 09:59 AM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో పార్టీలు వచ్చి పోయాయని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అటు దేశంలో కచ్చితంగా అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలకు ఉందని ఆయన అన్నారు. గ్రామాలలో అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో బూత్ కమిటీలు, యూత్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నాయకులకు కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏంచేసిందో , ఇప్పుడు ఉన్న టిఆర్ స్ ప్రభుత్వం ఇప్పుడు ఎం చేసిందో నాయకులు కార్యకర్తలు సంఘటితంగా ఉంటూ ప్రజలకు వివరించాలని అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్ట, అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్ గారు , నర్సింహా రావు, లక్ష్మీ నారాయణ, రఘుపతి రెడ్డి, రమేష్ రెడ్డి, బీసీ సెల్ తిరుపతయ్య గారు, ఎస్సీ సెల్ శ్రీనివాసులు గారు, యువజన కాంగ్రెస్ జిల్లా , మండల ఆయాకులు వెల్టూర్ రేణయ్య, మోగిలి మహేష్, శేఖర్ గౌడ్, గుండమోని శ్రీశైలం, ఎన్. ఎస్. యుఐ మండల నాయకులు రాజు, అన్ని గ్రామాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM