వాషింగ్టన్‌ డీసీ వేదికకు సంగారెడ్డి యువతి

byసూర్య | Thu, Nov 24, 2022, 09:27 AM

జీవశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించిన సంగారెడ్డికి చెందిన యువతికి అరుదైన గౌరవం లభించింది. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఏబీ)లో డాక్టర్‌ గిరీశ్‌ కె రాధాకృష్ణన్‌ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేస్తున్న కిరణ్మయి జోషికి అమెరికా ఇనిస్టిట్యూట్‌ నుంచి ఆహ్వానం అందింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డిసెంబరు 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో తాను పరిశోధన చేస్తున్న. జంతువుల నుంచి సంక్రమించే బ్రుసెల్లోసిస్‌ అనే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ మీద కిరణ్మయి 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. బ్రుసెల్లోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, నయం చేసేందుకు అవసరమైన పరిశోధనను కిరణ్మయి జోషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600 మంది ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే 16 మందికి మాత్రమే సదస్సుల్లో ప్రసంగించే అవకాశం దక్కింది. అందులో మనదేశం నుంచి కిరణ్మయి ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM