సుకన్య సమృద్ధి యోజన సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Thu, Nov 24, 2022, 09:24 AM

ఆడబిడ్డలకు భరోసానిచ్చే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి తపాలా శాఖ సబ్ డివిజన్ ఓవర్సీస్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం పరిధి మక్త లక్ష్మాపురంలో తపాలాశాఖ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి అకౌంట్ మేళా నిర్వహించారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ను పదేండ్లలోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తీసుకోవా లని సూచించారు. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నదన్నారు. మఖాలక్మాపురం గ్రామంలో 10ఏండ్ల లోపు బాలికలందరికీ సుకన్య సమృద్ధి అకౌంట్ను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన టీఆర్ఎస్ మండలాధ్య క్షుడు మురళీపంతులును అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవితారమేశ్, ఉప సర్పంచ్ పోచయ్య, కార్యదర్శి గౌసియా బేగం, పోస్టాఫీసర్లు మాణయ్య, విజయ్, రాఘవేందర్, సాయిరాం, గంగారాం, స్థానిక నాయకుడు ఆకుల ప్రభాకర్ ఉన్నారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM