మూడు నెలల పాటు అటువైపునకు వెళ్లదంటున్న పోలీసులు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:49 PM

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య కొత్త సవాల్ గా మారింది. తాజాగా మరోసారి ఈ సమస్య ఓ ప్రాంతంలో జఠిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట వైపు వెళ్లే వాహనాలు సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టి-జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునేందుకు అనుమతించరు.


రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా వైపు అనుమతించరు. అటువైపు వచ్చే వాహనాలు ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా రావొచ్చు. సికింద్రాబాద్ నుంచి కిమ్స్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ టెంపుల్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని ఫుడ్‌వరల్డ్ మీదుగా కిమ్స్ వైపు వెళ్లొచ్చు. లేదంటే సీటీవో ఫ్లై ఓవర్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని రాణిగంజ్ మీదుగా కిమ్స్ వైపు వెళ్లొచ్చు. అంబులెన్సులు కిమ్స్‌కు వెళ్లేందుకు బేగంపేట ఫ్లై ఓవర్ పైనుంచి సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకుని కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM