ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్‌లో సమీక్ష

byసూర్య | Wed, Nov 23, 2022, 01:51 PM

సీఎం కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయపన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది.


కేంద్రం వైఖరిపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM