టిఆర్ఎస్ నాయకులది కబ్జా సంస్కృతి : కాంగ్రెస్

byసూర్య | Wed, Nov 23, 2022, 10:10 AM

భూముల కబ్జాల సంస్కృతి టీఆర్‌ఎస్‌ నాయకులదేనని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. మంగళవారం నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆనంద్‌ స్వరూప్‌ షెట్కార్‌, కౌన్సిలర్‌ వివేకానంద్‌, మాజీ ఎంపీపీలు బాల్‌కిషన్‌, రామారావు, ఖేడ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సాయిలు, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు నెహ్రనా యక్‌ మాట్లాడారు. షెట్కార్‌ కుటుంబం అండదండ లతో రాజకీయాల్లో ఎదిగి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులే అసత్యపు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 'షెట్కార్‌ కుటుంబీకులు గతంలో కాశ్లీక్రా మాత ఆలయానికి 1.20 ఎకరాలు, బసవ మంటపానీకి ఎకరం, సంపు హౌజ్‌కు 30గుంటల భూమిని. రామాలయ ఆవరణలో నిర్మిస్తున్న కల్యాణ మంట పానికి రూ. 20 లక్షల విరాళం ఇచ్చారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు రామాలయానికి సంబంధించిన 7. 21 ఎకరాలను కబ్జా చేసీ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తున్నారన్నారు. డీటీపీసీ అను మతితో షెట్కార్‌ పటుంబీకులు సొంత భూమిలో వెంచర్‌ పనులు చేన్తుండగా దేవాదాయ శాఖ భూములు కబ్జా చేన్తున్నారనడం సరికాదన్నారు. దేవాలయ భూములకు నంబంధించిన నర్వేపై ఎలాంటి నంబంధం లేకున్నా మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు చందర్‌నాయక్‌, మాణీిక్‌రావు, సద్దాం, వీర్‌శెట్టి మారుతినాయక్‌, నారాయణరెడ్డి, బారీసేట్‌ పాల్గొన్నారు.


Latest News
 

సీసీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన Mon, Dec 05, 2022, 11:01 AM
నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన వివరాలు Mon, Dec 05, 2022, 11:00 AM
ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM