ఫారెస్ట్ రేంజర్ ను నరికి చంపిన గుత్తికోయలు

byసూర్య | Tue, Nov 22, 2022, 07:47 PM

విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు అధికారులు నాటిని మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. 


గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM