మల్లారెడ్డి సెల్ ఫోన్ ను గుర్తించిన ఐటీ అధికార్లు

byసూర్య | Tue, Nov 22, 2022, 07:47 PM

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై ఐటీ అధికార్లు దాడులు తీవ్ర అలజడులు రేపుతున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు తనిఖీలను నిర్వహిస్తున్నాయి. మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఎట్టకేలకు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. 


మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక యూనివర్శిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్ లో ఉన్న క్రాంతి బ్యాంక్ లో జరిగినట్టుగా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM