![]() |
![]() |
byసూర్య | Tue, Oct 04, 2022, 04:22 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం వుంటుందని, తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం. ఏ. కరీం అన్నారు. మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు 4నుండి అక్టోబర్10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సండోజి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందరికి మానసిక ఆరోగ్య సంరక్షణ-అవగాహన అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మానసిక ఆరోగ్య అవగాహన సదస్సుల బ్రోచర్ ను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఆవిష్కరించారు.