గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు..

byసూర్య | Tue, Oct 04, 2022, 03:40 PM

తెలంగాణలో అక్టోబర్ 16వ తేదీన గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. పరీక్ష నిర్వాహణపై టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప‌రీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TSPSC Group 1 Prelims) పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో. దీనిని అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు లేచాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3, 80, 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1, 51, 192 మంది దరఖాస్తు చేయగా. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. ఇక. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు https: //www. tspsc. gov. in/ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM