గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస

byసూర్య | Sun, Oct 02, 2022, 06:18 PM

గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. గత రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కళోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను సన్మానించారు. అనంతరం వారి ఆటపాటలను తిలకించారు. 


ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్రంపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా అందరి హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని అన్నారు. మతోన్మాదులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ  తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు.


హరితహారం కార్యక్రమంలానే తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని ప్రకాశ్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ భాషను, యాసను సినిమాల్లో హాస్య నటులకు వాడేవారని, కానీ ఇప్పుడు తెలంగాణ భాష అంటే ఏంటో అందరికీ తెలుస్తోందని ప్రకాశ్ రాజ్ అన్నారు.


Latest News
 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ Fri, Sep 22, 2023, 07:58 PM