ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ

byసూర్య | Sun, Oct 02, 2022, 06:15 PM

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక వీఆర్ఏ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగిందీ ఘటన. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన వీఆర్ఏ ఖాసిం.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 


వెంటనే అప్రమత్తమైన సహచర వీఆర్ఏలు అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ నెలల తరబడి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.


Latest News
 

ధర్మపురి అరవింద్ పిటిషన్‌పై ముగిసిన విచారణ Tue, Nov 29, 2022, 03:34 PM
సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు Tue, Nov 29, 2022, 02:54 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు Tue, Nov 29, 2022, 02:51 PM
న్యాయం చేయాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం Tue, Nov 29, 2022, 02:32 PM
మందుబాబులకు అడ్డగా మారిన వేములవాడ మినీ స్టేడియం Tue, Nov 29, 2022, 02:31 PM