తెలంగాణ నేతన్న ప్రతిభకు యునెస్కో గుర్తింపు

byసూర్య | Sun, Oct 02, 2022, 06:14 PM

తెలంగాణ రాష్ట్రానికి మరోమారు అరుదైన ఘనత దక్కింది. తెలంగాణ నేతన్నల నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. సిద్దిపేట నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే.. గొల్లభామ‌ చీరలకు యునెస్కో గుర్తింపు దక్కింది. దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో పొందడం గర్వకారణం అని.. ఇది నేతన్నల నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గౌరవం అని వ్యాఖ్యానించారు. వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే.. మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే.. అదే సిద్ధిపేట గొల్లభామ చీర అని మంత్రి హరీశ్ వివరించారు.


తల మీద చల్లకుండ పెట్టుకుని.. కుడి చేతిలో గురిగి పట్టుకుని.. కాళ్ల గజ్జెలు ఘల్‌ ఘల్‌ లాడిస్తూ.. మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా.. పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని మన అందరికి తెలుసు అని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. అలాంటి చరిత్ర ఉన్న గొల్లభామ చీరలను రాష్ట్ర ప్రభుత్వం జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తోందని వివరించారు. గోల్కొండ షోరూమ్‌లలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందని వివరించారు. కృషి, నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన‌ సిద్దిపేట నేతన్నలను అభినందించారు.


Latest News
 

ధర్మపురి అరవింద్ పిటిషన్‌పై ముగిసిన విచారణ Tue, Nov 29, 2022, 03:34 PM
సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు Tue, Nov 29, 2022, 02:54 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు Tue, Nov 29, 2022, 02:51 PM
న్యాయం చేయాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం Tue, Nov 29, 2022, 02:32 PM
మందుబాబులకు అడ్డగా మారిన వేములవాడ మినీ స్టేడియం Tue, Nov 29, 2022, 02:31 PM