భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు

byసూర్య | Fri, Sep 30, 2022, 02:23 PM

వికారాబాద్ జిల్లాలో శుక్ర‌వారం భ‌యాందోళ‌న‌కర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భూమి నుంచి భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దానికి భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ళ నుండి బయటకు వచ్చామ‌ని తెలిపారు. ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు ఉన్నారు. తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించిందని జనాలు చెబుతున్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని భూకంపమా… మరేమిటని ఆరా తీయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM