![]() |
![]() |
byసూర్య | Thu, Sep 29, 2022, 04:15 PM
కేసీఆర్ జాతీయ పార్టీ అంటే యూపీఏ భాగస్వామ్య నాయకులనే కలుస్తున్నాడు, బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలను, నాయకులను కలవడం లేదు. బీజేపీ - టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాల్లోనే కేసీఆర్ జాతీయ పార్టీ అని మధు గౌడ్ యాష్కీ ఆరోపించారు. మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి సాధ్యం కాదు.కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునే పనిలో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. తన కుటుంబం పై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో కేసీఆర్ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి కేసీఆర్ అంతర్గతంగా సహకరిస్తున్నాడు. టీఆర్ఎస్ తొ కాంగ్రెస్ పొత్తు అనే బీజేపీ ప్రచారం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకే చేస్తున్నారు.
టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కూడా బీజేపీ-టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమే. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
దేశంలో అత్యంత మోసపూరిత ముఖ్యమంత్రి కేసీఆర్ అని శరద్ పవార్ నాతో అన్నాడు.. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కేసీఆర్ ఎప్పుడు మసిపూసి మరేడుకాయ మాటలు చెబుతాడు. బీజేపీ - టీఆర్ఎస్ మధ్య వార్ నిజమే అయితే కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు లేవు. చెట్లతో వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ఉందని ప్రచారం. కేంద్రం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు. మంచిరెడ్డి రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతారు.
కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు తెలంగాణలోని అన్ని వర్గాలు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కూల్చి..ఎనిమిది ఏండ్ల తర్వాత విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టడానికి ఎనిమిది ఏండ్లు పట్టిందా..? కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాం అని కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారు.. తమ్ముడు తారక రామారావు స్టోరీలు చెప్పడం మానుకో. తెలంగాణ ప్రజలు తిరుగు బాటు కి సిద్ధం అవ్వండి.