![]() |
![]() |
byసూర్య | Thu, Sep 29, 2022, 04:13 PM
మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్,బీడీఎస్- బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35% సీట్లలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130 లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రం లోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి.