తెలంగాణకు ఊరాటనిచ్చేలా హైకోర్టు స్టే

byసూర్య | Wed, Sep 28, 2022, 07:59 PM

రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న ఓ వివాదంలో తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టు ఊరాటనిచ్చేలా స్టే ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదాల్లో ఒక‌టైన విద్యుత్ బ‌కాయిల చెల్లింపులో తెలంగాణ‌కు బుధ‌వారం ఈ తరహా భారీ ఊర‌ట ల‌భించింది. ఏపీకి బ‌కాయిప‌డ్డ ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ నుంచి బొగ్గును తీసుకున్న ఏపీ... అందుకు ప్ర‌తిగా విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసింది. అయితే కాల‌క్ర‌మేణా బొగ్గు బ‌కాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కోర‌గా... త‌మ విద్యుత్‌ను తీసుకున్న కార‌ణంగా ఆ బ‌కాయిల‌ను చెల్లించాలంటూ ఏపీ వాద‌న‌కు దిగింది. ఈ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారం కేంద్రం వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఇరు రాష్ట్రాల వాద‌న‌లు విన్న కేంద్రం... తెలంగాణనే ఏపీకి రూ.6,995 కోట్ల విద్యుత్ బ‌కాయి ప‌డిందని తేల్చింది. ఈ బ‌కాయిల‌ను చెల్లించాల‌ని తెలంగాణ‌కు ఆదేశాలు జారీ చేసింది.


ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కారు తెలంగాణ‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. బ‌కాయిల చెల్లింపుల‌ను నిలుపుదల చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌గా...తెలంగాణ త‌ర‌ఫున అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ రాంచంద‌ర్ రావు వాద‌న‌లు వినిపించారు. తెలంగాణ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన హైకోర్టు ఏపీకి చేయాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ చెల్లింపుపై స్టే విధించింది.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM