![]() |
![]() |
byసూర్య | Sun, Sep 25, 2022, 10:29 AM
ముషీరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. ముషీరాబాద్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని (19)ని రంజిత్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.