నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై చర్యలేవి

byసూర్య | Fri, Sep 23, 2022, 04:27 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు సర్వే నెంబర్ 1013 లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మంథని పట్టణానికి చెందిన మేడగోని శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఒక మహిళ పేరు మీద ఒక రైస్ మిల్ యజమాని ఓల్లాల సత్యనారాయణ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో జి ప్లస్ వన్ కు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకుని జి ప్లస్ టు నిర్మాణం చేపట్టిన దానిని అధికారులు ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు.

ఆర్ అండ్ బి రోడ్డుకు 7 ఫీట్ల ముందుకు బాల్కనీ పెంచి నిర్మాణం చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు కూడా స్పందించడం లేదన్నారు. సేట్ బ్యాక్ లేకుండా మున్సిపల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ భవనం నిర్మిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కట్టడం గురించి గతంలో పత్రికల్లో కూడా వార్తలు రావడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కు, టౌన్ ప్లానింగ్ అధికారికి ఈ నిర్మాణంపై చాలాసార్లు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని వాపోయారు. అధికారులు స్పందించకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటామని మేడగొని శ్రీనివాస్ పేర్కొన్నారు.


Latest News
 

భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM
స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ Fri, Sep 30, 2022, 02:04 PM
స్మిత సబర్వాల్ పర్యటన రద్దు Fri, Sep 30, 2022, 01:55 PM
భర్తను చంపి యాక్సిడెంట్‌గా నమ్మించిన మహిళ Fri, Sep 30, 2022, 01:50 PM