హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Sep 23, 2022, 02:36 PM

ఆదిలాబాద్: మందమర్రి హైవే రోడ్డుపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మందమర్రి ప్రాంతానికి చెందిన మేకల ప్రశాంత్, మేకల రాజ్ కుమార్ బైక్ మీద మంచిర్యాల నుండి మందమర్రికి వస్తుండగా మార్గమధ్యంలో భారీ లారి వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మేకల ప్రశాంత్ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జుగా అయింది. ఇంకొకరి పాదం భారీ లారీ టైర్ల కిందపడి పాదం తెగి పోయింది. వెంటనే స్పందించిన మందమర్రి పోలీస్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని అదుపులో తీసుకొని బాధితులను చికిత్స నిమిత్తం 108 లో తరలిస్తున్నారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Thu, Sep 28, 2023, 11:42 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM