లాభాల వాటా తేల్చని సింగరేణి

byసూర్య | Fri, Sep 23, 2022, 02:33 PM

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 26 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో ఖర్చుపోగా నికర లాభాలను హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో బుధవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటిస్తారని, ఆ వెంటనే లాభాల వాటాపై ప్రకటన వస్తుందని కార్మికులు ఆశగా ఎదురుచూశారు. సమావేశంలో ఇతర అంశాలపై చర్చించినా. లాభాల వాటా ప్రకటించకపోవడంతో వారు నిరాశకు లోనయ్యారు. గతేడాది ఇదే నెలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 274. 64 కోట్ల నికర లాభం ప్రకటించి అందులో 29 శాతం వాటాగా రూ. 79. 06 కోట్లను కార్మికులకు పంపిణీ చేశారు. ఈసారి మాత్రం ప్రకటన చేయకపోవడంతో కార్మిక వర్గం సందిగ్ధంలో పడింది. కాగా, సింగరేణి నికర లాభాలు ప్రకటించని అంశంపై డైరెక్టర్ (పా) ఎస్. చంద్రశేఖర్ ను వివరణ. కోరగా, ఇంకా ఆడిట్ పూర్తి కానందునే ప్రకటించలేదని స్పష్టం చేశారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM