![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 12:42 PM
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశం సందర్భంగా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు షాద్ నగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం షాద్ నగర్ నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ కాన్వాయ్ లతో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి తరలి వెళ్లారు. ప్రజల కష్టాలు సుఖాలలో తోడుగా ఉండడానికి ప్రజా పరిపాలన అందించడానికి బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి మద్దతు తెలిపేందుకు పెద్దఎత్తున తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్, వంశీకృష్ణ, మోహన్ సింగ్ నాయక్, ఇసునాతి శ్రీనివాస్, లష్కర్ నాయక్, రుషికేశ్, మల్చలం మురళి, చెట్ల వెంకటేశ్, శ్యాంసుందర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, రాజు నాయక్, వినోద్ నాయక్, బోయ అశోక్, కంది అనూష, దివిటి వెంకటేష్, సుభాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లింగం, సురేష్ ముదిరాజ్, సురేందర్, చంటి, రమేష్, నరేష్ తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.