దళితులే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక

byసూర్య | Fri, Sep 23, 2022, 12:28 PM

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పత్తి కుమార్ అధ్యక్షతన దళిత కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ల సమావేశం గురువారం నాడు మేడ్చల్ నియోజకవర్గం తూంకుంట లోని మొగుళ్ళ వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టిపిసిసి అనుబంధ సంఘాల ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ , టి పి సి సి ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగరిగరి ప్రీతం , టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దళితులు, కాంగ్రెస్ పార్టీ వేరు, వేరు కాదని దళితులలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రక్తమేనని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కష్ట కాలం వచ్చినా దళితులే ఆదుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి నడిపిస్తారని దళితుల అభివృద్ధికి కూడా కాంగ్రెస్ పార్టీయే కృషి చేసిందని ఈరోజుకి కూడా దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఉంటుందని అని అన్నారు.

ఈ సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అధ్యక్షులు పానుగంటి మహేష్ , మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ బి బ్లాక్ అద్యక్షులుగా నియమితులైన కుర్రి మహేష్ కుమార్, ఉప్పల్ నియోజకవర్గ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , కూకట్ పల్లి నాయకులు శ్రీరంగం సత్యం , తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధికార ప్రతినిధి గరిశల సురేందర్ ముదిరాజ్ , మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ , ఐ ఎన్ టి సి రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ , మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షులు సింగరేణి పోచయ్య , ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మోహన్ , కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ , శామీర్ పేట తూంకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాష్కి శంకర్ గౌడ్ , భీమిడి జైపాల్ రెడ్డి , టిపిసిసి ఎస్సి సెల్ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ , మరియు మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM