వీఆర్ఏల ఆందోళన

byసూర్య | Fri, Sep 23, 2022, 11:51 AM

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది. శుక్రవారానికి 61 వ రోజుకు చేరుకోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన అయిజలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వివిధ గ్రామాల నుంచి అయిజ కు చేరుకున్న వీఆర్ఏలు ముందుగా తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి, అక్కడి నుంచి తహసిల్దార్ కార్యాలయం వద్దకు కాలినడకన వెళ్లారు.


అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా కోకన్వీనర్ మద్దమ్మ, మండల అధ్యక్షుడు నాగన్న, సంఘం నాయకులు వెంకటేష్, పరుశరాముడు, గోకార్ నాయుడు, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM