అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకులు అందజేత

byసూర్య | Fri, Sep 23, 2022, 10:37 AM

రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, పెద్దల జ్ఞాపకార్థం చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి సుమారు 1, 50, 000 రూపాయల విలువైన బియ్యం, నిత్యవసర సరుకులు, బట్టలు గురువారం అందజేశారు. దాతలు ప్రత్యేక వాహనంలో సరుకులను తీసుకెళ్లి ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. గత ఏడాది కూడా ఇదేవిధంగా పితృపక్షాల సమయంలో అమ్మానాన్న అనాధాశ్రమానికి తమ వంతు బాధ్యతగా బియ్యం సరుకులు అందించారు. 75 మంది దాతల నుండి 25 క్వింటాళ్ల బియ్యము, 75 వేల రూపాయల విలువైన నిత్యాసర సరుకులు, బట్టలను ఈ సందర్భంగా అభాగ్యులకు అనాధలకు అందజేశారు. ప్రతి ఏటా ఇదే విధంగా అనాధలకు దానం చేయనున్నట్లు, రఘునాథపురం పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకున్న దాతలు స్పందించి సహకరించినందుకు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రఘునాథపురం ఆర్యవైశ్యులతో పాటు గ్రామంలోని పలువురు ఇతర ప్రాంతాల్లో పలు కారణాలవల్ల జీవనం కొనసాగిస్తున్న రఘునాథపురం చెందిన, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సాయం చేశారు. అమ్మానాన్న అనాధాశ్రమంలో ముక్కోటి సోమలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. రఘునాథపురం పట్టణ ఆర్యవైశ్య సంఘం చేస్తున్న సేవలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల జిల్లాలోని మండలంలోని పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. మార్గదర్శకంగా ఆదర్శంగా రఘునాథపురం ఆర్యవైశ్య సంఘం సేవలు కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM