![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 10:33 AM
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడలో అక్రమార్కులు అక్రమంగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించడంతో నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం ఇదే క్రమంలో అక్రమార్కులు పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని టిప్పర్ల ద్వారా తరలించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్రమ మట్టి దందాను అడ్డుకొని అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఎస్సై రాజు గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మదగిన సమాచారం మేరకు కొండాపూర్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడలో అక్రమంగా, అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశామని తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ముసుగులో కొంతమంది నాయకులు అక్రమం మట్టి దందాను కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.