అధికారం శాశ్వతం కాదు: కేటీఆర్

byసూర్య | Thu, Sep 22, 2022, 08:57 PM

అధికారం రాగానే అది శాశ్వతమని కొందరు ఊహించుకుంటారని.. కాని వచ్చిన అవకాశాన్ని ఓ మంచి పనిని చేయడానికి ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజకీయ నాయకులకు సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలనుకునే వారు మంచి పనులు చేయాలని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచలేదని చెప్పారు. మంచి పనులు చేద్దామని, ప్రజల మనసులను గెలుచుకుందామని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6 వేల మందికి పైగా విద్యార్థులకు బైజూస్ సాఫ్ట్ వేర్ లోడ్ చేసిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.తాను అలాంటి మంచి పనులపై దృష్టి పెట్టానని చెప్పారు. తన పుట్టిన రోజున అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు పోకుండా.. నలుగురికి ఉపయోగపడే విధంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ప్రారంభించానని వివరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ విధంగా మంచి పనులు చేయాలని సూచించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM