ఆ రోజు రాత్రి 12:30 గంటల వరకు మెట్రో అదుబాటులోకి

byసూర్య | Thu, Sep 22, 2022, 08:27 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న క్రికెట్ ఫ్యాన్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు దాటనుంది. ఈ సమయంలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఇళ్లకు వెళ్లేందుకు నగరంలో ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రికెట్ ఫ్యాన్స్ రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇదిలావుంటే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఇక వివాదాలన్నింటినీ పక్కనపెట్టేసి 25న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM