వెన్నెముక లాంటి వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేస్తారా: కేటీఆర్

byసూర్య | Thu, Sep 22, 2022, 08:26 PM

దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం దారుణమని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు.. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోంది గనుక దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే బుధవారం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.


కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే...ఇక రైతులకు ఉచిత విద్యుత్ అనేదే దక్కదని కూడా కేటీఆర్ అన్నారు. రైతులకు ఇస్తున్న రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్రం విద్యుత్ సంస్కరణలను ముందుకు తెస్తోందని ఆయన ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతాంగమేనని ఆయన అన్నారు. ఈ సంస్కరణలు అమలు అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, తమ పొలంలో రైతులు కూలీలుగా మారిపోతారని ఆయన అన్నారు.


Latest News
 

బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి Fri, Sep 30, 2022, 03:18 PM
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత Fri, Sep 30, 2022, 03:15 PM
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి Fri, Sep 30, 2022, 03:15 PM
భూమి నుంచి భారీ శ‌బ్దం భ‌యాందోళ‌న చెందిన ప్ర‌జ‌లు Fri, Sep 30, 2022, 02:23 PM
స్మోకింగ్ చేసేవారు తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలివే Fri, Sep 30, 2022, 02:15 PM