byసూర్య | Thu, Sep 22, 2022, 05:07 PM
మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అని తెలుసుకోవాలన్నారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదన్నారు.